తిరుపతి: పిచ్చాటూరు మండల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని సోమవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సంధర్భంగా మండల అభివృద్ధి కార్యక్రమాలు గురించి చర్చించారు. అనంతరం పార్టీ బలోపేతం కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలని వారికి పెద్దిరెడ్డి సూచించారు. ఈ కార్యక్రమంలో స్థానిక వైసీపీ నాయకులు పాల్గొన్నారు.