SKLM: పాతపట్నం మండల తహశీల్దార్ కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కారం కొరకు బుదవారం ఉ.9 గం నుండి మ. 2 గంటల వరకు పాతపట్నం MLA మామిడి గోవిందరావు ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. ఈ కార్యక్రమానికి మండల, డివిజనల్ స్థాయి అధికారులు హాజరు అవ్వాలని ఆదేశించారు. ప్రజలు నేరుగా తమ సమస్యలను ఆర్జీల రూపంలో MLA కి అందజేయవచ్చునని తెలిపారు.