W.G: భీమవరంలోని ఏపీఈపీడీసీఎల్ కార్యాలయంలో శుక్రవారం విద్యుత్ సమస్యల పరిష్కార వేదిక నిర్వహించనున్నట్లు విద్యుత్ శాఖ ఈఈ ఎన్. వెంకటేశ్వరరావు ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం 1.30 వరకు జరిగే విద్యుత్ సమస్యల పరిష్కార వేదికలో విద్యుత్ సరఫరాలో తరచుగా వచ్చే సమస్యలకు సంబంధించి దరఖాస్తులు ఇవ్వవచ్చున్నారు.