చిత్తూరు: ఎస్ఆర్ పురం మండలం తయ్యూరు పాయకట్టు ఇలవేల్పు అయిన ఆరిమాని గంగమ్మ తల్లి ఆలయంలో ఆదివారం అమ్మవారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు చేశారు. వివిధ రకాల పుష్పాలతో అమ్మవారిని సుందరంగా అలంకరించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ప్రధాన అర్చకులు వెంకటచలపతి ఆచార్యులు, భక్తులు పాల్గొన్నారు.