SKLM: వైసీపీ ఉత్తరాంధ్ర జిల్లాల రీజనల్ కో ఆర్డినేటర్‌గా రాజ్యసభ సభ్యులు వి.విజయసాయిరెడ్డిని నియమించారు. పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు పార్టీ అధిష్టానం నియామక ప్రకటనను శుక్రవారం రాత్రి విడుదల చేసింది. గతంలో ఉత్తరాంధ్ర జిల్లాల్లో పనిచేసిన అనుభవంతో పాటు అందరికీ సుపరిచితుడు కావడంతో పార్టీ వర్గాలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.