SKLM: ఈ నెల మూడో తేదీలోగా రైతులు ఈకే వైసీని పూర్తి చేసుకోవాలని జిల్లా వ్యవసాయాధికారి కె.త్రినాథస్వామి అన్నారు. ఖరీఫ్ పంటలను సాగు చేస్తున్న రైతులందరూ విధిగా ఈకేవైసీని పూర్తి చేసుకోవాలన్నారు. పంట నష్టం, ప్రభుత్వ రాయితీలు, ఇతరత్రా పథకాలు రైతులకు వర్తించాలంటే ఈకేవైసీ తప్పనిసరి అని పేర్కొన్నారు. ఈ విషయాన్ని రైతులు గమనించాలని సూచించారు.