KDP: లక్కిరెడ్డిపల్లి మండలంలోని అర్హులైన పేదలందరికీ సాగు భూములు ఇవ్వాలని సీపీఐ రాయచోటి నియోజకవర్గ కార్యదర్శి శ్రీనివాసులు డిమాండ్ చేశారు. సీపీఐ ఆధ్వర్యంలో లక్కిరెడ్డిపల్లి తహశీల్దార్ కార్యాలయం ఎదుట నిరసన తెలిపారు. కూటమి ప్రభుత్వమైన అర్హులైన నిరుపేదలందరికీ ప్రతి కుటుంబానికి మూడు ఎకరాలు సాగుభూమి పంపిణీ చేయాలని కోరారు.