KDP: చిన్నమండెం మండలం బోరెడ్డిగారిపల్లెలో సోమవారం సిమెంటు రోడ్డు నిర్మాణానికి రాష్ట్ర రవాణా, యువజన, క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి భూమి పూజ చేశారు. ఆయన మాట్లాడుతూ.. గతంలో గ్రామాలు అభివృద్ధికి నోచుకోక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని పేర్కొన్నారు. నేడు ప్రభుత్వం ప్రతి గ్రామానికి సిమెంట్ రోడ్లు, కాలవలను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.