BPT: ఇటీవల గుంటూరులో జరిగిన రాష్ట్రస్థాయి అబాకస్ పోటీలలో బాపట్ల విద్యార్థులు ప్రతిభ కనపరచి బహుమతులు సాధించారని యూసీ మాస్ బాపట్ల సంస్థ డైరెక్టర్ రాజేంద్రప్రసాద్ అన్నారు. బాపట్లలో విజేతలకు బహుమతులు ప్రదాన కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిధిగా హాజరైన మత్య్సశాఖ జిల్లా అధికారి సురేష్ మాట్లాడుతూ.. అబాకస్ నేర్చుకోవడం వలన పిల్లలకు ఎంతో ఉపయోగం ఉందన్నారు.