King Charles: బ్రిటన్ రాజు చార్లెస్‌కు క్యాన్సర్
బ్రిటన్ రాజు చార్లెస్-3కి క్యాన్సర్ నిర్ధారణ అయ్యిందని బకింగ్ హాం ప్యాలెస్ వెల్లడించింది. ఈ విషయాన్ని బ్రిటన్ రాజకుటుంబం సోషల్ మీడియా ద్వారా తెలిపింది.
King Charles: బ్రిటన్ రాజు చార్లెస్-3కి క్యాన్సర్ నిర్ధారణ అయ్యిందని బకింగ్ హాం ప్యాలెస్ వెల్లడించింది. ఈ విషయాన్ని బ్రిటన్ రాజకుటుంబం సోషల్ మీడియా ద్వారా తెలిపింది. అయితే అది ప్రొస్టేట్ క్యాన్సర్ కాదని.. రాజుకు ఇటీవల పెరిగిన ప్రొస్టేట్‌కు చికిత్స సందర్భంగా వైద్య పరీక్షల్లో వ్యాధి బయటపడినట్లు తెలిపింది. అయితే అది ఏ రకమైన క్యాన్సరనేది అధికారికంగా వెల్లడించలేదు. ఆయన సోమవారం నుంచి చికిత్స తీసుకుంటున్నారని వెల్లడించింది. త్వరలోనే ఆయన సాధారణ విధుల్లోకి వస్తారని పేర్కొంది. కాగా, కింగ్ చార్లెస్ త్వరగా కోలుకోవాలని బ్రిటన్ ప్రధాని రిషి సునక్ ఆకాంక్షించారు.
ఇక రాజు ఆరోగ్యంపై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఆందోళన వ్యక్తం చేశారు. 75 ఏండ్ల చార్లెస్-3 తన తల్లి క్వీన్ ఎలిజబెత్ మరణంతో 2022, సెప్టెంబర్ 8న రాజుగా బాధ్యతలు చేపట్టారు. 2023, మే 6న పట్టాభిషేకం చేశారు. కాగా, క్యాన్సర్ సమస్యపై అవగాహన పెంచడం కోసమే ఆయన తన చికిత్స గురించి బయటకు వెల్లడించారని కింగ్ చార్లెస్ ప్రతినిధి తెలియజేశారు. ప్రస్తుతం ‘ఔట్‌డోర్ పేషంట్’గా చికిత్స పొందుతున్నారని వెల్లడించారు.