»Most Expensive Currency In The World Where Is The Position Of The Rupee
Expensive currency: ప్రపంచంలో అత్యంత ఖరీదైన కరెన్సీలివే.. రూపాయి స్థానం ఎక్కడంటే?
ప్రపంచంలో అత్యంత బలమైన కరెన్సీల లిస్టును ఫోర్బ్స్ విడుదల చేసింది. ఆ దేశ సరఫరా-గిరాకీ, ద్రవ్యోల్బణం, దేశీయ ఆర్థిక వృద్ధి, కేంద్ర బ్యాంకుల విధానాలు, ఆర్థిక స్థిరత్వం వంటి అంశాలన్నీ అధ్యయనం చేసి ఈ లిస్ట్‌ను విడుదల చేశారు. డాలర్ 10వ స్థానంలో ఉంది. ఇండియా ఎక్కడుందో చూద్దాం.
most expensive currency in the world. Where is the position of the rupee?
Expensive currency: ప్రపంచంలో అత్యంత బలమైన కరెన్సీల జాబితాను (Strongest Currency List) ఫోర్బ్స్ తాజాగా విడుదల చేసింది. కువైటీ దినార్ ఈ లిస్ట్‌లో ఫస్ట్ ప్లేస్‌లో ఉంది. తరువాత బహ్రెయినీ రెండో స్థానంలో ఉంది. 2024 జనవరి 10 నాటికి ఉన్న ప్రపంచ కరెన్సీ విలువల ఆధారంగా ఈ లిస్ట్ రూపొందించింది.
ఇక భారత కరెన్సీ రూపాయి (ఒక డాలర్=రూ.82.9) 15వ స్థానంలో ఉంది. ఇక ఈ జాబితాలో అమెరికా డాలర్ పదో స్థానంలో ఉంది. ప్రపంచవ్యాప్తంగా వాణిజ్యానికి విస్తృతంగా వినియోగిస్తున్న కరెన్సీ అమెరికా డాలర్ అని ఫోర్బ్స్ వెల్లడించింది. 1960 నుంచి కువైటీ దినార్ ప్రపంచంలోనే అత్యంత బలమైన కరెన్సీగా కొనసాగుతోంది. స్విస్ ఫ్రాంక్ ప్రపంచంలో అత్యంత స్థిరమైన కరెన్సీగా ఫోర్బ్స్ పేర్కొంది. ఒక యూనిట్‌తో కొనుగోలు చేసే వస్తువులు, సేవల సంఖ్య, మారకం ద్వారా వచ్చే విదేశీ కరెన్సీ మొత్తాన్ని మూల్యాంకనం చేయడం ద్వారా కరెన్సీ విలువ నిర్ణయిస్తారు అని ఫోర్బ్స్ వివరించింది. ఒక కరెన్సీ ప్రాముఖ్యతను నిర్ణయించడానికి సరఫరా-గిరాకీ, ద్రవ్యోల్బణం, దేశీయ ఆర్థిక వృద్ధి, కేంద్ర బ్యాంకుల విధానాలు, ఆర్థిక స్థిరత్వం వంటి అంశాలన్నీ అధ్యయనం చేయాల్సి ఉంటుందని పేర్కొంది.