»Duddilla Sridhar Babu From December 9th 2023 Travel In Buses Will Be Free For Womens
Duddilla sridhar babu: డిసెంబర్ 9 నుంచి మహిళలకు బస్సుల్లో ప్రయాణం ఫ్రీ
తెలంగాణలో మహిళలకు బస్సుల్లో ఉచిత ప్రయాణం సహా ఆరోగ్య శ్రీ స్కీం పరిధిని రూ.10 లక్షలకు పెంచుతున్న హామీలు డిసెంబర్ 9 నుంచి అమల్లోకి వస్తాయని రాష్ట్ర ఆర్థిక మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు(duddilla sridhar babu) ప్రకటించారు. ఉచిత కరెంట్ అంశం గురించి రేపు రేవంత్ నిర్ణయం తీసుకుంటారని వెల్లడించారు.
duddilla sridhar babu From December 9th 2023 travel in buses will be free for womens
తెలంగాణలో డిసెంబర్ 9 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా మహిళలందరికీ ఆర్టీసీ బస్సు(rtc buses)ల్లో ఉచితంగా ప్రయాణం చేసే సౌకర్యం కల్పిస్తామని తెలంగాణ ఆర్థిక మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ప్రకటించారు. ఈ క్రమంలో మహిళలు తమ ఆధార్ కార్డు చూపించి బస్సుల్లో జర్నీ చేయవచ్చని చెప్పారు. అంతేకాదు రాష్ట్రవ్యాప్తంగా ప్రస్తుతం ఉన్న ఆరోగ్యశ్రీ వైద్యం ఖర్చులను రూ.10 లక్షలకు పెంచుతున్నట్లు తెలిపారు. దీనిపై ఇప్పటికే రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలిపినట్లు వెల్లడించారు. సోనియాగాంధీ పుట్టినరోజున వీటిని అమల్లోకి తీసుకొస్తామని శ్రీధర్ బాబు(duddilla sridhar babu) ప్రకటించారు. ఈ నేపథ్యంలో శుక్రవారం ఆయా శాఖల అధికారులతో చర్చించి వాటిని ప్రారంభిస్తామని తెలిపారు.
మరోవైపు రాష్ట్రంలో ఎన్నికల సంధర్భంగా ప్రకటించిన ఆరు హామీల విషయంలో కేబినెట్ సుదీర్ఘంగా చర్చించామని ఆర్థిక మంత్రి చెప్పారు. క్రమంగా ఎన్ని హామీలను కాంగ్రెస్ పార్టీ తప్పకుండా అమలు చేస్తుందని అన్నారు. అంతేకాదు 2014 నుంచి 2023 డిసెంబర్ 7 వరకు అన్ని శాఖల్లో ఎంత ఖర్చు పెట్టారో పూర్తి వివరాలు తెలుపాలని ప్రభుత్వాన్ని కోరినట్లు శ్రీధర్ బాబు చెప్పారు. ఆ వివరాల ఖర్చులన్నీ శ్వేతపత్రం విడుదల చేస్తామన్నారు. ప్రతి గ్యారెంటీ గురించి కేబినెట్ లో చర్చిస్తామని అన్నారు. రేపు సీఎం రేవంత్ రెడ్డి ఉచిత విద్యుత్ అంశంపై నిర్ణయం తీసుకుంటారని వెల్లడించారు. దీంతోపాటు రైతు బంధుకు సంబంధించి ఆయా ఫైనాన్స్(finance) డిపార్ట్ మెంట్ల నుంచి వివరాలను కోరినట్లు చెప్పారు.
ఇది కూడా చూడండి:CM Revanth reddy: మాట నిలబెట్టుకున్న సీఎం రేవంత్ రెడ్డి.. తొలి సంతకం దేనిపై చేశారంటే