»Rahul Dravid Couple Enjoyed Their Son Play The Match
Dravid: కుమారుడి ఆటను ఆస్వాదించిన రాహుల్ దంపతులు
దిగ్గజ క్రికెటర్ రాహుల్ ద్రావిడ్ సింపుల్‌గా ఉంటారు. తన ఇద్దరు కుమారులు కూడా క్రికెట్లో ఉత్తమ ప్రతిభ కనబరుస్తున్నారు. పెద్ద కుమారుడు సమిత్ మ్యాచ్ ఆడుతుండగా పేరంట్స్ వీక్షించారు.
Rahul Dravid Couple Enjoyed Their Son Play The Match
Dravid: భారత క్రికెట్ దిగ్గజం, టీమిండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్‌కు (Dravid) ఇద్దరు కుమారులు. సమిత్, అన్వయ్.. వీరిద్దరూ క్రికెట్లో దుమ్ము ధూళిపేస్తున్నారు. చిన్న కుమారుడు అన్వయ్ కర్ణాటక అండర్-14 కెప్టెన్ కాగా.. సమిత్ ఇతర టోర్నమెంట్లలో ఆడుతున్నాడు. సమిత్ క్రికెట్ ఆడుతుండగా భార్య విజితాతో కలిసి ద్రావిడ్ (Dravid) చూశారు. రాహుల్ ద్రావిడ్ (Dravid) లాగే అతని కుమారులు కూడా క్రికెట్లో మంచి ప్రతిభ కనబరుస్తున్నారు. జూనియర్ లెవల్లో చక్కగా ఆడుతున్నారు. నెక్ట్స్ మెయిన్ టీమ్‌కు సెలక్ట్ కావడమే మిగిలి ఉంది. నేషనల్ లెవల్ కూచ్ బెహార్ టోర్నమెంట్లో సమిత్ కర్ణాటకకు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. మైసూర్లో కర్ణాటక, ఉత్తరాఖండ్ మధ్య మ్యాచ్ జరిగింది. ఆటను చూసేందుకు ద్రావిడ్ (Dravid) దంపతులు మైసూర్ స్టేడియానికి విచ్చేశారు. చాలా సింపుల్‌గా కుమారుడి ఆటను చూశారు. ఆ ఫోటో సోషల్ మీడియాలో షేర్ చేయగా చక్కర్లు కొడుతోంది. అవును ద్రావిడ్ చాలా సింపుల్‌గా ఉన్నారు. ఏ ఆడంబరం.. లేకుండా మ్యాచ్ చూసేశారు.