KNR: సైదాపూర్(M) సర్వాయిపేట గ్రామంలో మంగళవారం విద్యుత్ షాక్తో గొర్రెల కాపరి మృతి చెందిన సంఘటన చోటుచేసుకుంది. స్థానికులు, గ్రామస్థులు తెలిపిన వివరాల ప్రకారం.. సర్వాయిపేట శివారులో మాందాపూర్ గ్రామానికి చెందిన రైతులు కోతుల బెడద కోసం విద్యుత్తు తీగలు అమర్చగా గమనించకుండా వెళ్లిన గొర్రెల కాపరి బొల్లి సమ్మయ్య (52)తో పాటు రెండు మేకలు మృతి చెందినట్లు తెలిపారు.