»Apsrtc Said Buses Are Running In Andhra Pradesh No Rumours Spread In Social Media
APSRTC: ఏపీలో బస్సులు నడుస్తున్నాయ్..పుకార్లు వద్దు
ఆంధ్రప్రదేశ్లో మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడిని సీఐడీ పోలీసులు అరెస్టు చేశారు. ఈ నేపథ్యంలో ఏపీలో బస్సులు బంద్ అనే విషయాన్ని పలువురు నెట్టింట ప్రచారం చేయగా..దీనిని ఏపీఎస్ఆర్టీసీ ఖండించింది. బస్సులు యాథావిధిగా నడుస్తున్నాయని వెల్లడించింది.
APSRTC said Buses are running in andhra pradesh no rumours spread in social media
ఏపీలో మాజీ సీఎం చంద్రబాబు నాయుడు అరెస్టైన నేపథ్యంలో ఏపీ వాప్తంగా ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆర్టీసు బస్సులు నిలిచిపోయాయని సోషల్ మీడియాలో పలువురు పుకార్లు ప్రచారం చేస్తున్నారు. అయితే దీనిపై ఏపీఎస్ఆర్టీసీ(APSRTC) స్పందించింది. ఆర్టీసీ బస్సులు యాథావిధిగా నడుస్తున్నాయని అధికారులు స్పష్టం చేశారు. ఏపీలో ప్రజా రవాణాకు ఎలాంటి ఇబ్బంది లేదని అన్నారు. ఓ స్కాం కేసులో చంద్రబాబు అరెస్ట్ అయితే బస్సులు ఎందుకు నిలిపివేస్తామని వెల్లడించారు. ఈ నేపథ్యంలో ప్రజలు ఇలాంటి పుకార్లను నమ్మోద్దని కోరారు. ఏదైనా డౌట్ ఉంటే తమను సంప్రదించాలని కోరారు.
అంతేకాదు తెలంగాణకు కూడా యాథావిధిగా బస్సులు నడుస్తున్నాయని అధికారులు అన్నారు. షెడ్యూల్ ప్రకారమే బస్సులు(buses) తిరుగుతున్నాయని అన్నారు. దూర ప్రాంత ప్రయాణికులు ఇలాంటి పుకార్ల విషయంలో జాగ్రత్తగా ఉండాలని కోరారు. ఎదైనా అనుమానం ఉంటే తమని సంప్రదించాలని సూచించారు. దీంతోపాటు ప్రతి రోజు అనేక మంది ప్రజలు తెలుగు రాష్ట్రాల మధ్య రాకపోకలు సాగిస్తుంటారు. ప్రధానంగా హైదరాబాద్ నుంచి ఏపీకి నిత్యం వేల మంది ప్రయాణం చేస్తుంటారు. ఇలాంటి నేపథ్యంలో పుకార్లను సోషల్ మీడియాలో ప్రచారం చేయోద్దని ఆర్టీసీ అధికారులు మీడియాతోపాటు పలువురిని కోరారు.