»American Junior Team Created A Record For The Highest Score In Oneday Cricket Also Won With A Huge Margin And Set Another Record
Cricket: వన్డే క్రికెట్లో సరికొత్త ప్రపంచ రికార్డ్
వన్డే క్రికెట్లో సరికొత్త రికార్డ్ నమోదు అయింది. ఇప్పటి వరకు ఉన్న అత్యధిక స్కోర్ ఉన్న రికార్డు ఇప్పుడు బ్రేక్ అయింది. 2022లో నెదర్లాండ్స్‌పై ఇంగ్లండ్ 498 పరుగులు చేసి ఈ ప్రపంచ రికార్డును నమోదు చేసింది. ఇప్పుడు అమెరికా జూనియర్ జట్టు కొత్త చరిత్ర సృష్టించింది. అంతే కాకుండా భారీ తేడాతో గెలిచి మరో రికార్డును తన ఖాతాలో వేసుకుంది.
American junior team created a record for the highest score in oneday cricket. also won with a huge margin and set another record.
Cricket: యూఎస్ఏ(USA) అండర్-19 జట్టు వన్డే క్రికెట్(Cricket)లో ప్రపంచ రికార్డు నమోదు చేసింది. టొరంటో క్రికెట్ క్లబ్లో జరిగిన ఐసీసీ అండర్-19 పురుషుల క్రికెట్ ప్రపంచకప్‌లో భాగంగా అమెరికాస్ క్వాలిఫయర్ మ్యాచ్‌లో అమెరికా అండర్-19, అర్జెంటీనా అండర్-19(America vs Argentina) జట్లు తలపడ్డాయి. ముందు బ్యాటింగ్ చేసిన అమెరికా భారీ షాట్లతో విజృంభించింది. ఓపెనర్లు ప్రణవ్ చెట్టిపాళ్యం, భవ్య మెహతా అద్భుంగా రాణించారు. 43 బంతుల్లో 61 పరుగులు చేశారు. అందులో 10 ఫోర్లు ఉన్నాయి. భవ్య మెహతా 91 బంతుల్లో 3 భారీ సిక్సర్లు, 14 ఫోర్లతో 136 పరుగులు చేశాడు. మూడో స్థానంలో వచ్చిన రిషి రమేష్ 59 బంతుల్లో సెంచరీ సాధించాడు. అందులో 2 సిక్సర్లు, 13 ఫోర్లు బాదాడు. ఆ తర్వాత అర్జున్ మహేష్ 67 పరుగులు చేయగా, అమోగ్ ఆరెపల్లి 48 పరుగులు చేశాడు. లోయర్ ఆర్డర్లో ఉత్కర్ష్ శ్రీవాస్తవ 22 బంతుల్లో 40 పరుగులు చేశాడు. దీంతో అమెరికా అండర్-19 జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 515 పరుగులు చేసింది.
516 భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన అర్జెంటీనా కనీసం స్కోర్ చేయలేక చతికిల పడింది. టీమ్‌లో వ్రోగ్డెన్హిల్ 18 పరుగులు చేయగా, ఫెలిప్ నెవెస్ 15 పరుగులు చేశాడు. అమెరికా తరపున అరిన్ నద్కర్ణి 6 ఓవర్లలో 21 పరుగులు మాత్రమే ఇచ్చి 6 వికెట్లు పడగొట్టాడు. ఫలితంగా అర్జెంటీనా అండర్-19 జట్టు 19.5 ఓవర్లలో కేవలం 65 పరుగులకే ఆలౌటైంది. దీని ద్వారా అమెరికా అండర్-19 జట్టు 450 పరుగుల భారీ విజయాన్ని నమోదు చేసింది. ఈ మ్యాచ్‌లో 515 పరుగులు చేయడం ద్వారా USA అండర్-19 జట్టు ICC టోర్నమెంట్లో అత్యధిక పరుగులు చేసి ప్రపంచ రికార్డు సాధించింది. దీనికంటే ముందు ఈ రికార్డు ఇంగ్లాండ్ జట్టుపై ఉండేది. 2022లో జరిగిన మ్యాచ్‌లో నెదర్లాండ్‌పై 498 పరుగులు చేసి ప్రపంచ రికార్డును సృష్టించగా ఆ రికార్డును ఇప్పుడు యూఎస్ఏ జట్టు తిరగరాసింది.