హర్యానా ప్రభుత్వం (Haryana Govt) డేరా బాబా పై మరోసారి దయ చూపింది.తన ఆశ్రమంలో బాలికలపై లైంగిక దాడులకు పాల్పడిన ఆరోపణలపై జైలు జీవితం గడుపుతున్న డేరా బాబా (Dera Baba) గుర్మీత్ రాం రహీం సింగ్‌కు 30 రోజుల పెరోల్ మంజూరైంది. ఈ ఏడాది జనవరిలో పెరోల్‌పై బయటకు వచ్చిన డేరా బాబాకు మరోసారి ప్రభుత్వం పెరోల్ ఇచ్చింది.పెరోల్ సమయంలో యూపీలోని బాగ్పట్ జిల్లాలోని షా సత్నం ఆశ్రమంలో డేరా బాబా నివసిస్తారు.