WGL: హై రిస్క్ గర్భిణులను సమయానికి గుర్తించి, వారికి మెరుగైన వైద్య సేవలు అందించాలని DMHO డా. సాంబశివరావు సూచించారు. వరంగల్ DMHO కార్యాలయంలో అర్బన్ టీమ్ ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో మాట్లాడుతూ.. ప్రమాదకర లక్షణాలను ముందుగా గుర్తించి నిపుణుల సలహాతో జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. మాతా-శిశు మరణాలను తగ్గించేందుకు అందరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.