KRNL: ఆదోనిలో ప్రధాన రవాణా మార్గమైన పాత బ్రిడ్జి శిథిలావస్థకు చేరుకుని ప్రమాదకరంగా మారింది. ఈ సమస్యపై టీడీపీ జిల్లా అధ్యక్షురాలు గుడిసె క్రిష్ణమ్మ ఇవాళ ఎంపీ నాగరాజుకు వినతిపత్రం అందజేశారు. ఆమె మాట్లాడుతూ.. రోజూ వేలాది మంది ప్రయాణించే బ్రిడ్జిపై గోతులు,ఇనుప రాడ్లతో ప్రమాదాలు జరుగుతున్నాయని తెలిపారు. కొత్త బ్రిడ్జి నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని కోరారు.