WGL: పర్వతగిరి మండలంలో నూతన సంవత్సరం, సంక్రాంతి శుభాకాంక్షలతో పాటు మేడారం జాతరకు వెళ్లే భక్తులకు స్వాగతం పలుకుతూ అధికార పార్టీ నాయకులు ప్రధాన రహదారిపై ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను రాత్రికి రాత్రే చించివేశారు. దీంతో ఫ్లెక్సీలు కట్టిన వారు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. చింపిన వారు సైతం అధికార పార్టీకి చెందినవారే అని స్థానికుల్లో చర్చ జరుగుతోంది.