KDP: పోలీస్ పరేడ్ గ్రౌండ్లో సంక్రాంతి వేడుకలు ఘనంగా జరిగాయి. జిల్లా ఎస్పీ విశ్వనాథ్ ఐపీఎస్ భోగి మంటను వెలిగించి వేడుకలకు శ్రీకారంచుట్టారు. భోగి మంటలు, రంగవల్లులు, హరిదాసు కీర్తనలు, గాలిపటాలు, సంప్రదాయ వంటకాలతో పండుగ వాతావరణం నెలకొంది. పోలీసు అధికారులు కుటుంబసభ్యులతో కలిసి వేడుకలు జరుపుకోవాలని ఈ కార్యక్రమం నిర్వహించినట్లు ఎస్పీ తెలిపారు.