TG: దండకారణ్యంలో మిగిలిపోయిన 17 మంది తెలంగాణ మావోయిస్టులకు డీజీపీ శివధర్ రెడ్డి మరో కీలక పిలుపునిచ్చారు. పునరావాసం కల్పించడంతో పాటు, వారి మీదున్న రివార్డులు అందజేస్తామని హామీ ఇచ్చారు. ప్రస్తుతం అడవుల్లో ఉండి పోరాటం చేయలేని పరిస్థితులు ఏర్పడ్డాయని.. అనవసరంగా ప్రాణాల మీదకు తెచ్చకోవద్దని విజ్ఞప్తి చేశారు.