AP: ఎన్టీఆర్ జిల్లాలోని పెనుగంచిప్రోలులో కొలువుదీరిన తిరుపతమ్మ అమ్మవారి దేవస్థానంలో రంగుల మహోత్సవాన్ని నిర్వహించారు. పెనుగంచిప్రోలు రంగుల మండపం నుంచి జగ్గయ్యపేట రంగుల మండపం వరకు ఎద్దుల బండ్లపై దేవతామూర్తులను తీసుకెళ్లేందుకు పెనుగంచిప్రోలు గ్రామస్తులకు అవకాశం కల్పించారు. లాటరీ ద్వారా భక్తులను ఎంపిక చేశారు. రెండేళ్లకోకసారి రంగుల మహోత్సవం జరుగుతుందని అధికారులు తెలిపారు.