కామారెడ్డి మున్సిపాలిటీ పరిధిలోని 12వవార్డ్ విద్యుత్ నగర్ దేవునిపల్లిలో ఆదివారం కాలనీ వాసులు తమ సమీపంలోని ఖాళీ స్థలంలో పేరుకుపోయిన చెత్త, పిచ్చి మొక్కలను తొలగించి, చెత్తను కాల్చివేశారు. ఈ కార్యక్రమంలో శేషారావు,పత్తి గంగయ్య, కాతురి సంగమేశ్వర్, సుష్మ, హరిత, రమ్య, సూచరిత లడ్డు, మాన్విత తదితరులు పాల్గొని పరిసరాలను శుభ్రం చేశారు.