ATP: కూటమి ప్రభుత్వం విద్యాశాఖ మీద ప్రత్యేకమైన శ్రద్ధ చూపిస్తూ విద్యాభివృద్ధికి కృషి చేస్తుందని గతంలో లేనివిధంగా ప్రణాళికబద్ధంగా ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి కృషి చేస్తుందని, గుంతకల్లు ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పేర్కొన్నారు. ఆదివారం ఆయన నివాసంలో తెలుగునాడు ఉపాధ్యాయ సంఘం నూతన క్యాలెండర్లను ఆవిష్కరించారు.