NZB:హైదరాబాద్ రవీంద్రభారతిలో సావిత్రిబాయి ఫూలే జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. సావిత్రిబాయి ఫూలే ఫౌండేషన్, బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో రాష్ట్రస్థాయి ప్రతిభ పురస్కారాలను అందజేశారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు చెందిన బుగ్గలి రజక స్వప్న (కులవృత్తిలో సేవలు), సురుకుట్ల ఝాన్సీ (వ్యాపార రంగం) తమ రంగాల్లో చూపిన ప్రతిభకు అవార్డులను అందుకున్నారు.