కృష్ణా: మచిలీపట్నంలో భోగరాజు పట్టాభి సీతారామయ్య స్మారక భవనం నిర్మాణానికి కేటాయించిన స్థలాన్ని బ్రాహ్మణ వెల్ఫేర్ కార్పోరేషన్ రాష్ట్ర డైరెక్టర్ ఫణి కుమారుడు ఆదివారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మచిలీపట్నం ప్రజలందరికీ ఉపయోగపడే విధంగా పట్టాభి స్మారక భవనం త్వరలో ఏర్పాటు అవుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కూటమి నేతలు, తదితరులు పాల్గొన్నారు.