AP: రాయలసీమ లిఫ్ట్ పనులు నిలిపివేయించానన్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను ఏపీ ఖండించింది. తన విన్నపం మేరకు సీఎం చంద్రబాబు పనులు నిలిపివేశారన్నది అసంబద్ధమని పేర్కొంది. జగన్ హయాంలో అనుమతులు లేకుండా రాయలసీమ లిఫ్ట్ ప్రాజెక్టు పనులు చేపట్టారని తెలిపింది. కేంద్రం, NGTతో పాటు పలు చోట్ల TG ఫిర్యాదు చేసింది. తెలంగాణ ఫిర్యాదులతో విచారించి అనుమతులు లేనందున పనులు నిలిపివేసింది.