AP: కొండగట్టు పర్యటనలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కు ప్రమాదం తప్పింది. పర్యటన సందర్భంగా అభిమానులకు అభివాదం చేస్తూ పవన్ కారుపైకెక్కారు. ఆ సమయంలో విద్యుత్ కేబుల్స్ రావడంతో సిబ్బంది అప్రమత్తమయ్యారు. ఈ క్రమంలో కేబుల్స్ ముందే పసిగట్టి కారుపైనే పవన్ పడుకున్నారు. దీంతో పెను ప్రమాదం తప్పినట్లైంది.