PDPL: గోదావరిఖని ప్రెస్‌క్లబ్‌లో ఇవాళ సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎఐటీయూసీ అధ్యక్షులు వాసిరెడ్డి సీతారామయ్య మాట్లాడుతూ.. సింగరేణిలో యాజమాన్యం గుర్తించిన బొగ్గు బ్లాక్‌లను సింగరేణికి ఇవ్వకుండా టెండర్ ప్రక్రియ ద్వారా ప్రైవేటు సంస్థలకు ఇస్తే బొగ్గు తవ్వకాలను అడ్డుకుంటామని హెచ్చరించారు.