NLG: ఎలాంటి ఇబ్బందులకు అవకాశం ఇవ్వకుండా మొదటి విడత గ్రామ పంచాయతీ ఎన్నికలను నిర్వహిం చాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆదేశించారు. బుధవారం ఆమె గట్టుప్పల మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన ఎన్నిక ల పంపిణీ, స్వీకరణ కేంద్రాన్ని తనిఖీ చేశారు. ఎన్నికల సామాగ్రి పంపిణీకై ఆయా రూట్ల వారిగా ఏర్పాటు చేసిన టబుళ్ళును పరిశీలించారు.