ADB: పౌరులందరూ తమ ఓటు హక్కును తప్పనిసరిగా వినియోగించాలని కలెక్టర్ రాజర్షి షా సూచించారు. బుధవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో వెబ్ క్యాస్టింగ్ ఏర్పాట్లను పరిశీలించారు. సమస్యాత్మక ప్రాంతాల్లో వెబ్ క్యాస్టింగ్ ద్వారా పోలింగ్ సరళినీ నిరంతరం పర్యవేక్షించడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ట్రైనీ కలెక్టర్ సలోని చబ్రా, జిల్లా పంచాయతీ అధికారి రమేష్, తదితరులు పాల్గొన్నారు.