»Today Is World Milk Day June 1st India That Consumes The Most Milk Worldwide
Today World Milk Day: పాలు ఎక్కువ ఉపయోగించే దేశం తెలుసా?
నేడు (జూన్ 1) ప్రపంచ పాల దినోత్సవం(World Milk Day). ఈ సంవత్సరం థీమ్(theme) పాడి, పర్యావరణంతోపాటు అదే సమయంలో పోషకమైన ఆహారాలు, జీవనోపాధిని అందించడంపై దృష్టి సారించడం. ఈ నేపథ్యంలో ఈరోజు ప్రత్యేకత గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
ప్రపంచవ్యాప్తంగా పాల వినియోగం, ప్రయోజనాలను తెలియజేసేందుకు ఐక్యరాజ్యసమితి (UN) ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ (FAO) 2001లో సిద్ధమైంది. అప్పటి నుంచి ప్రతి ఏటా జూన్ 1న ప్రపంచ పాల దినోత్సవాన్ని(World Milk Day) నిర్వహిస్తుంది. ఈ నేపథ్యంలో పాడి పరిశ్రమ అభివృద్ధికి సంబంధించి సాధ్యమయ్యే కార్యక్రమాల అవగాహన, మద్దతునిచ్చే అవకాశాలపై దృష్టి సారిస్తుంది.
2022లో భారతదేశం ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా పాలను వినియోగించింది. 85 మిలియన్ మెట్రిక్ టన్నుల పాలను ఉపయోగించారు. యూరోపియన్ యూనియన్ 23.8 మిలియన్ మెట్రిక్ టన్నులు, యునైటెడ్ స్టేట్స్ 20.975 మిలియన్ మెట్రిక్ టన్నుల పాల వినియోగాన్ని కల్గి ఉంది. ఈ డేటాను బట్టి చూస్తే చాలు మన దేశంలో అనేక మంది జీవితాల్లో పాలు ఎంత ప్రాముుఖ్యత వహిస్తున్నాయో తెలుస్తుంది. ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ కార్పొరేట్ స్టాటిస్టికల్ డేటాబేస్ (FAOSTAT) 2021-22 ప్రకారం భారతదేశం ప్రపంచంలో అత్యధిక పాల ఉత్పత్తిదారుగా ఉంది. ఈ సంవత్సరంలో ప్రపంచ పాల ఉత్పత్తిలో ఇరవై నాలుగు శాతం వాటాతో భారత్ మొదటి స్థానంలో ఉంది.
ఈ రోజు ప్రపంచవ్యాప్తంగా ప్రజలలో పాల(milk)పై అవగాహన పెంచే కార్యక్రమాలు చేపడతారు. సమతుల ఆహారంలో పాల విలువ గురించి ప్రజలకు తెలియజేయడం. అలాగే అది జీవనోపాధికి ఎలా సహాయపడుతుందనేది ఈ రోజు ఉద్దేశ్యం. FAO అంచనా ప్రకారం పాడి పరిశ్రమ ఒక బిలియన్ కంటే ఎక్కువ మందికి జీవనోపాధికి కల్పిస్తుందని చెబుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఆరు బిలియన్ల కంటే ఎక్కువ మంది ప్రజలు పాల ఉత్పత్తులను స్వీకరిస్తున్నారు.