భారత్‌లో రష్యా అధ్యక్షుడు పుతిన్ అడుగుపెట్టిన వేళ ప్రధాని మోదీ ప్రోటోకాల్ బ్రేక్ చేశారు. ఢిల్లీలోని పాలం విమానాశ్రమంలో తన సెక్యూరిటీ ప్రోటోకాల్‌ను పక్కన పెట్టి పుతిన్ దగ్గరికి వెళ్లి స్వాగతం పలికారు. భారత్‌కు ప్రాణ స్నేహితుడిగా భావించే రష్యా అధ్యక్షుడి కోసం ప్రధాని ప్రోటోకాల్‌ను పక్కన పెట్టడం గమనార్హం.