ప్రకాశం: మౌళిక వసతులు కల్పించి మున్సిపాలిటీ ని అభివృద్ధి చేయనున్నట్లు మున్సిపల్ చైర్మన్ అబ్దుల్ గఫార్ అన్నారు. కనిగిరిలోని 5వ వార్డులో 29,50.000.రూపాయల నిధులతో నిర్మిస్తున్న నూతన డ్రైనేజ్ నిర్మాణ పనులను గురువారం పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ.. డ్రైనేజ్ నిర్మాణ పనులను నాణ్యత ప్రమాణాల విషయంలో రాజీ పడకుండా యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలన్నారు.