VZM: నెల్లిమర్ల ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో మ్యాథమెటిక్స్, బోటనీ గెస్ట్ ఫ్యాకల్టీ పోస్టులు భర్తీ చేయనున్నట్లు ప్రిన్సిపాల్ కందుల రేఖ చెప్పారు. ఇవాళ ఆమె ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ ఏడాది మ్యాథమెటిక్స్, బోటనీ మేజర్స్ ప్రారంభించినట్లు చెప్పారు. ఆసక్తిగల అభ్యర్థులు ఈనెల 8వ తేదిన మధ్యాహ్నం 2 గంటలకు వాక్ ఇన్ ఇంటర్యూకు కళాశాలలో నిర్వహించనున్నట్లు చెప్పారు.