MDK: జిల్లా పోలీస్ కార్యాలయ ప్రాంగణంలో రైజింగ్ డే వేడుకల్లో భాగంగా గురువారం పలు మ్యాచ్లను నిర్వహించారు. జిల్లా ఎస్పీ డివి శ్రీనివాసరావు సమక్షంలో తుది పోటీలు నిర్వహించగా వాలీబాల్ పోటీల్లో మెదక్ సర్కిల్, రామాయంపేట సర్కిల్, కబడ్డీ పోటీల్లో అల్లాదుర్గం సర్కిల్, రామాయంపేట సర్కిల్ ప్రథమ ద్వితీయ స్థానాలు నిలిచాయి. క్రీడల్లో గెలుపొందిన జట్లను ఎస్పీ అభినందించారు.