NZB: మోస్రా మండలం దుబ్బ తండా గ్రామ పంచాయతీ సర్పంచి స్థానానికి ఇద్దరు అభ్యర్థులు బరిలో ఉన్నారు. గతంలో ఏకగ్రీవమైన ఈ స్థానానికి ఈసారి పోటీ ఉండడంతో గ్రామంలో హోరా హోరి ప్రచారం కొనసాగుతోంది. తమకు కేటాయించిన గుర్తులు చూపిస్తూ అభ్యర్థులు ఓటర్లను ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారు. చింతకుంట, తిమ్మాపూర్, గోవూర్, మోస్రాలోనూ ముమ్మరంగా ప్రచారం కొనసాగుతోంది.