గబ్బా వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న యాషెస్ రెండో టెస్టులో ఇంగ్లండ్ బ్యాటర్ జో రూట్ సెంచరీతో అదరగొట్టాడు. 181 బంతుల్లో 11 ఫోర్ల సహాయంతో సెంచరీని పూర్తి చేసుకున్నాడు. మిగతా బ్యాటర్లందరూ విఫలమవుతున్నా కూడా అతడు ఒంటరి పోరాటం చేస్తున్నాడు. ఇది అతడి టెస్టు కెరీర్లో 40వ సెంచరీ కావడం విశేషం. కాగా, ప్రస్తుతం ఇంగ్లండ్ 9 వికెట్ల నష్టానికి 307 పరుగులు చేసింది.