PLD: గురజాల ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు, సినీ హీరో నారా రోహిత్ దంపతులను నిన్న మర్యాదపూర్వకంగా కలిశారు. హీరో రోహిత్ భార్య శిరీష స్వగ్రామమైన రెంటచింతలకు వారు వచ్చిన సందర్భంగా ఈ భేటీ జరిగింది. ఎమ్మెల్యే స్వగ్రామం మంచికల్లు (రెంటచింతల మండలం) కావడం అలాగే, శిరీష కుటుంబంతో ఆయనకు పాత పరిచయాలు ఉన్నట్లు సమాచారం.