NRML: కార్తీక పౌర్ణమి సందర్భంగా భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయాలకు విచ్చేసేఅవకాశాన్ని దృష్టిలో ఉంచుకొని పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేపట్టినట్లు ఎస్పీ జానకి షర్మిల మంగళవారం తెలిపారు. ప్రధానంగా బాసర సరస్వతి దేవి ఆలయం, తానూర్లోని విఠలేశ్వర స్వామి ఆలయం, కదిలి పాపహరేశ్వర ఆలయం, నిర్మల్ దేవర కోట ఆలయాలలో భద్రత చర్యలు తీసుకున్నట్లు చెప్పారు.