తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె, ఎమ్మెల్సీ కవిత కి బీజేపీ నేత ఈటల రాజేందర్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. షర్మిలను పోలీసులు అరెస్టు చేయడం తెలంగాణ రాజకీయాల్లో తీవ్ర కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో… బీజేపీ నేతలు కొందరు షర్మిలకు అండగా నిలిచారు. ఈ క్రమంలో… కవిత సెటైర్లు వేశారు. షర్మిల.. బీజేపీ వదిలిన బాణం అంటూ కౌంటర్ వేశారు. ఆ కౌంటర్లకు… తాజాగా ఈటల రాజేందర్ స్ట్రాంగ్ కౌంటర్ ఇవ్వడం గమనార్హం.
షర్మిల బీజేపీ వదిలిన బాణమా? కాదా? అనే విషయాన్ని పక్కన పెడితే ఆమెది ఒక పార్టీ అని ఆయన అన్నారు. ఆమె ట్వీట్ కు బదులిస్తూ ఆయన ఓ ట్వీట్ చేశారు. సీపీఐ, సీపీఎంలు సీఎం కేసీఆర్ వదిలిన బాణాలా? అంటూ ఆయన ప్రశ్నించారు. ప్రజా స్వామ్యంలో అన్ని పార్టీలు నిరసనలు చేస్తాయని పేర్కొన్నారు.
కానీ ప్రభుత్వం అధ్వాన్నంగా, దుర్మార్గంగా వ్యవహరిస్తోందని ఫైర్ అయ్యారు. అలా ఎవరు చేసినా ఖండించాల్సిందేనని ఆయన తెలిపారు.
పోలీసులను అడ్డు పెట్టుకొని ప్రభుత్వం అరాచకాలకు పాల్పడుతోందని మండిపడ్డారు. పోలీసులను నమ్ముకున్న ఎవరూ ముందు పడరని చెప్పారు. 2021- 22 ఆర్థిక సంవత్సరానికి రూ. 36 వేల కోట్లు వడ్డీ కడుతోందని అన్నారు. బడ్జెట్ రూప కల్పనలో అన్ని తప్పులున్నాయని చెప్పారు.