NLR: పొదలకూరు మండలంలోని నావూరు పెద్దవాగు పొంగిపొర్లడంతో నావూరు, చెన్నారెడ్డిపల్లి, భోగసముద్రం, కొండలరాయుడు కండ్రిక గ్రామాలకు రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. కాంట్రాక్టర్ నిర్లక్ష్యంగా తూములు లేకుండా డైవర్షన్ రోడ్డు ఏర్పాటు చేయడంతో వరదలో అది కూడా కొట్టుకుపోయింది. తూములు ఉంటే నీరు సులభంగా ప్రవహించేదని గ్రామస్తులు పేర్కొన్నారు.