వరల్డ్ బాక్సింగ్ చాంపియన్‌షిప్స్‌లో ముగ్గురు భారత అమ్మాయిలు సెమీస్‌కు దూసుకెళ్లారు. దీంతో 3 మెడల్స్ ఖరారయ్యాయి. నిన్న జరిగిన క్వార్టర్ ఫైనల్స్‌లో ఒల్టినోయ్ సొటింబొవ(UZB)పై నుపుర్ షెరాన్ 4-1 తేడాతో విజయం సాధించి సెమీస్‌కు చేరింది. అలాగే మమజొనోవా(UZB)పై జేస్మీన్ 5-0తో.. ఎమిలియా(POL)పై పూజ 3-2తో గెలిచి సెమీస్‌కు అర్హత సాధించారు.