SRPT: షార్ట్ సర్క్యూట్తో ఇల్లు దగ్దమైన ఘటన మునగాల మండలంలోని కోదండ రామపురం గ్రామంలో చోటు చేసుకుంది. బాధితులు దార్ల లాలయ్య తెలిపిన వివరాల ప్రకారం.. గత కొన్ని రోజులుగా ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలకు ఇవాళ ఉదయం 8:30 గంటలకు ఇంట్లో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ అయినట్లు తెలిపారు. టీవీ ,ఫ్యాన్ పదివేల రూపాయల నగదు, గృహోపకరణాలు పూర్తిగా దగ్ధమయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు.