AP: హాస్టల్ విద్యార్థుల సంక్షేమం, ఆరోగ్యం, భద్రతకు కూటమి సర్కార్ పెద్దపీట వేస్తుందని మంత్రి డీబీవీ స్వామి పేర్కొన్నారు. ఏడాదిలోపే రూ.143 కోట్లతో మరమ్మతులు చేసినట్లు తెలిపారు. రూ.100 కోట్లతో కొత్త హాస్టళ్లు నిర్మిస్తున్నామని, విద్యార్థుల ఆరోగ్య సంరక్షణకు జిల్లాకు ప్రత్యేక వైద్యాధికారిని నియమించామన్నారు. వైసీపీ హయాంలో హాస్టళ్లకు మెయింటెనెన్స్ నిధులైనా ఇచ్చారా అని ప్రశ్నించారు.