WGL: నగరలో అభివృద్ధికి దోహదపడే మామునూరు విమానాశ్రయ నిర్మాణానికి కాంగ్రెస్ ప్రభుత్వం కీలక ముందడుగు వేసిందని వరంగల్ డీసీసీ అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ తెలిపారు. భూసేకరణ నిమిత్తం 205 కోట్లు విడుదల చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడంపై ఆమె హర్షం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం నిధులు విడుదల చేసి, మరోసారి తన నిబద్ధతను చాటుకుందన్నారు.