SRD: సంగారెడ్డి జిల్లాలోని సాంఘిక సంక్షేమ వసతి గృహ మరమ్మతులకు 3.30 కోట్ల నిధులు మంజూరు అయినట్లు జిల్లా ఎస్సీ అభివృద్ధి అధికారి అఖిలేష్ రెడ్డి ఆదివారం ప్రకటనలో తెలిపారు. 33 వసతి గృహాలకు నిధులు కేటాయించినట్లు చెప్పారు. ఒక్కో వసతి గృహానికి 10 లక్షల చొప్పున మంజూరైనట్లు పేర్కొన్నారు. హాస్టల్లో మౌలిక వసతులు కల్పిస్తామని తెలిపారు.