VZM : ఆంధ్రప్రదేశ్ గ్రంథాలయ సంఘం విజయనగరం జిల్లా శాఖ అధ్యక్షులు, రచయిత సముద్రాల గురుప్రసాద్ తెలుగు కీర్తి పురస్కారానికి ఎంపికయ్యారు. తెలుగు వ్యావహారిక భాషా పితామహుడు గిడుగు రామ్మూర్తి పంతులు జయంతిని పురస్కరించుకొని హైదరాబాద్ తెలుగు విశ్వవిద్యాలయంలో జరుగనున్న కార్యక్రమంలో ఈ అవార్డును ప్రధానం చేస్తారని అధికారులు తెలిపారు.