సత్యసాయి: గోరంట్ల మండలం భూదిలి గ్రామంలో గాలివానకు తన అరటి తోట నెలకు ఒరిగిందని రైతు బ్రహ్మచారి ఆవేదన వ్యక్తం చేశారు. మంగళవారం రైతు మాట్లాడుతూ.. చేతికి వచ్చిన అరటి పంట అకాల వర్గానికి దెబ్బతినిందని తెలిపారు. దీంతో రూ.లక్షల్లో నష్టం వాటిల్లిందని వాపోయారు. ప్రభుత్వం వెంటనే స్పందించి పంటకు నష్టపరిహారం చెల్లించి తనను ఆదుకోవాలని రైతు కోరారు.